గుమ్మడిదల, తెలంగాణ సాక్షి న్యూస్
కరోనా విపత్కర పరిస్థితుల్లో మీకు మేము అండగా ఉంటాం అధైర్యపడవద్దు అంటూ ముందుకు వచ్చి బాధితులకు భరోసా కల్పిస్తున్నారు మై చారిటీ ఫౌండర్ యాదిరెడ్డి. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని ఆపద కాలంలో పేద ప్రజల పక్షాన నిలిచి అవసరమైన వసతులను కల్పించడంలో ఆయన చేసిన సేవలకు నగరానికి చెందిన ప్రణవి ఫౌండేషన్ రాష్ట్రస్థాయి అవార్డును అందించారు. మున్సిపాల్ పరిధిలో కరోనాకు గురైన పేదవారి పట్ల దాతృత్వాన్ని చాటి నిత్యావసర వస్తువులు, వైద్య సహాయం, ఆర్థిక అవసరాలను తీర్చడంలో యాదిరెడ్డి చేసిన సేవలకు గాను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. తన సేవలను గుర్తించిన ప్రణవి పౌండేషన్ నిర్వాహకులకు ఈ సందర్భంగా యాదిరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు ట్రస్టు ద్వారా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మై చారిటీ ట్రస్టు ద్వారా ప్రతీ ఒక పేద కుటుంబాలకు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

0 Comments