లయన్స్ క్లబ్ సేవలు ప్రశంసనీయం
ఎమ్మెల్యే జిఎంఆర్
వైకుంఠధామం లో మౌలిక వసతుల కల్పనకు పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించిన లయన్స్ క్లబ్
పటాన్చెరు తెలంగాణ సాక్షి న్యూస్
సమాజహితం కోసం లయన్స్ క్లబ్ చేపడుతున్న కార్యక్రమాలు ప్రశంసనీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణంలోని వైకుంఠధామం లో మౌలిక వసతుల ఏర్పాటుకు పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇందుకు సంబంధించిన చెక్కు ను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడంతోపాటు, ఉచిత వైద్య శిబిరాలు, అంబులెన్సులు అందించడంతో పాటు ప్రపంచ శాంతి కోసం లయన్స్ క్లబ్ చేపడుతున్న కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం అని కొనియాడారు. క్లబ్ చేపడుతున్న కార్యక్రమాలకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన లయన్స్ క్లబ్ ప్రతినిధి స్వర్ణలతను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు.

0 Comments