Wanted Reporters

Wanted Reporters

భవిష్యత్ పై డెసిషన్ పైనల్..ఈటలను అనుకున్న గ్రహణం

 హైదరాబాద్ తెలంగాణ సాక్షి న్యూస్

తాజా మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఏ పార్టీలో చేరబోతున్నారోనన్న చర్చకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. బీజేపీలో చేరేందుకు అన్నింటా సమాయత్తం అయిన ఈటల బుధవారం వేకువ జాము నుండే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన తన అభిమానులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. విడివిడిగా కలుస్తున్న ఈటల తాను ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బావుంటుంది, రానున్న కాలంలో సొంతగా పార్టీ పెట్టాలా లేక వేరే పార్టీలో చేరాలా అన్న విషయంపై అంతర్గతంగా అభిప్రాయాలు సేకరిస్తున్నారు. రాష్ట్రంలోని 10 జిల్లాలకు చెందిన నాయకులు శామీర్ పేట లోని ఈటల నివాసానికి వెల్లి చర్చలు జరిపారు. సొంత పార్టీ పెడితే ముందుకు సాగడం ఎలా ఉంటుంది, ప్రజలను అనుకూలంగా మల్చుకునే పరిస్థితులు ఉన్నాయా లేవా అన్న విషయాలపై కూడా చర్చించినట్టు సమాచారం. వేరే పార్టీలో చేరితే కాంగ్రెస్, బీజేపీల్లో ఏది బెటర్ అన్న విషయంపై కూడా వారిని ఈటల అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. ఈటలను కలిసిన వారిలో వివిధ కుల సంఘాల నాయకులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.


*అడొచ్చిన గ్రహణం..*

ఈటల రాజేందర్ ఫైనల్ నిర్ణయం తీసుకున్నప్పటికీ బుధవారం గ్రహణం ఉన్నందున గురువారం రోజు మీడియా ముందు తన అభిప్రాయాన్ని ప్రకటించాలని నిర్ణయించుకున్నారు. ఎల్లుండి బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించిన వెంటనే టీఆర్ఎస్ పార్టీకి, హుజురాబాద్ ఎమ్మెల్యేకు రాజీనామా కూడా చేసే అవకాశాలు ఉన్నాయి.

Post a Comment

0 Comments

Ad Code