*వ్యాక్సినేషన్ కోసం జనాల పడిగాపులు ఆనంద్ కృష్ణారెడ్డి*
తెలంగాణ సాక్షి న్యూస్:-
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ప్రజలు కరోనా వ్యాక్సినేషన్ కోసం ప్రతిరోజు బారులు తీరుతున్నారు అని స్థానిక బిజెపి నాయకులు ఆనంద్ కృష్ణారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి రోజు 500 మంది వాక్సిన్ కోసం వేచి ఉండడంతో పరిస్థితులు భయాందోళన కలిగిస్తున్నాయి అన్నారు. వైద్య సిబ్బంది మాత్రం కేవలం 100మంది కి మాత్రమే వ్యాక్సినేషన్ చేస్తున్నట్లు వివరించారు. అలాంటప్పుడు ఆ రోజు ఎంతమందికి వ్యాక్సినేషన్ చేస్తున్న వివరాలను నోటీసు బోర్డులో పెట్టాలని సూచించారు. ఇలా పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి ఆస్పత్రి వద్ద ఉండటంతో కరోనా ప్రబలే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు.సంబంధిత వైద్య అధికారులు ఇప్పటికైనా ఈ సమస్యను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు
.


0 Comments