పటాన్చెరు తెలంగాణ సాక్షి న్యూస్
సీనియర్ పాత్రికేయులు భాస్కర్ రావు మృతి పట్ల పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు. పటాన్చెరు కేంద్రంతోపాటు జిల్లా కేంద్రంగా వివిధ దిన పత్రికలో పని చేసిన భాస్కరరావు ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసే వారని కొనియాడారు. ఈ సందర్భంగా భాస్కర్ రావు తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రస్తుత కరోనా విపత్కర సమయంలో జర్నలిస్టు సోదరులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.


0 Comments