సంగారెడ్డి తెలంగాణ సాక్షి న్యూస్:-
లాక్ డౌన్ అమలు జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో పటిష్టంగా అమలవుతున్నది. సంగారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్ పోస్టు వద్ద మంగళవారం ఉదయం లాక్ డౌన్ అమలును డీఎస్పీ బాలాజీ పర్యవేక్షించారు. 10 గంటల తర్వాత బయటకు వచ్చే వాహనదారులను ప్రశ్నించి, పొంతన లేని సమాధానం చెప్పిన వారి వాహనాలను సీజ్ చేశారు. సంగారెడ్డి పట్టణ శివారులోని పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్ పోస్టు వద్ద సంగారెడ్డి రూరల్ సీఐ శివలింగం ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు.

0 Comments