మంబాపూర్ గ్రామంలో కోవిడ్ పై ఇంటింటి సర్వే
గుమ్మడిదల తెలంగాణ సాక్షి న్యూస్:-
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల పరిధిలోని మంబాపూర్ గ్రామంలో అధికారులు కోవిడ్ పై సర్వే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కోవిడ్ పై ఇంటింటి సర్వే చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఇంటికి వచ్చే సిబ్బందికి ఆరోగ్య సంబంధించిన వివరాలను అందించాలన్నారు. ఎవరికైనా కోవిడ్ లక్షణాలు ఉంటేవెంటనే సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు.కరోనా నివారణ చర్యలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పంచాయతీ సెక్రెటరీ వైద్య సిబ్బంది స్థానికులు పాల్గొన్నారు.


0 Comments