Wanted Reporters

Wanted Reporters

మైత్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

 మైత్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.



గుమ్మడిదల తెలంగాణ సాక్షి న్యూస్:-


గుమ్మడిదల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో మైత్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదానం శిబిరాన్ని ఏర్పాటు చేశారు కరోన విపత్కర పరిస్థితుల్లో నిలోఫర్ హాస్పిటల్ వారు గర్భిణీ స్త్రీలకు మరియు తలసేమియా వ్యాధి బాధితులకు రక్తం అత్యవసరం ఉందనే విషయాన్ని మైత్రీ ఫౌండేషన్ కు తెలుపగ ఫౌండేషన్ వారు స్థానిక 25 మంది యువకులతో రక్తదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని స్థానిక యస్.ఐ. విజయకృష్ణ, జడ్పీటీసీ కుమార్ గౌడ్, గుమ్మడిదల సర్పంచ్ నర్సింహారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మైత్రీ ఫౌండేషన్ చైర్మన్ చెన్నంశెట్టి ఉదయకుమార్ సభ్యులు మ్యాకల మహేష్ కుమార్, నవీనసాగర్, ఐనవోలు వేంకటరెడ్డి, నల్ల శ్రీనివాసగౌడ్, కంది రాము, పడమటి నిఖిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Ad Code