తెలంగాణ సాక్షి న్యూస్:-
దిల్లీ: కొవిడ్ రోగులు ఆసుపత్రుల్లో చేరడంపై జాతీయ విధానంలో కేంద్రం సవరణలు చేసింది. ఆరోగ్య సేవలకు కొవిడ్ నిర్థరణ తప్పనిసరికాదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొవిడ్ రోగుల సౌకర్యం కోసం సవరణలు చేసింది. కొవిడ్ అనుమానిత రోగులను ఆసుపత్రుల్లో చేర్చుకోవాల్సిందేనని, వారికి చికిత్స అందించాలని స్పష్టం చేసింది. వేరే నగరం నుంచి వచ్చిన కొవిడ్ రోగులను స్థానిక గుర్తింపు కార్డు లేకపోయినా ఆసుపత్రుల్లో చేర్చుకోవాలని ఆదేశించింది

0 Comments