కరోనా కష్టకాలంలో ప్రతి పేదవాడికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలి ..బిజెపి నాయకులు ఆనంద్ కృష్ణారెడ్డి
బొల్లారం తెలంగాణ సాక్షి న్యూస్:-
కరోనా మహమ్మారి వల్ల ఎంతో మంది బలి అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నారు. మరి కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొని బ్రతుకు పోరాటం చేస్తూ మరణిస్తున్న వారికి ప్రభుత్వం ఎటువంటి పథకాలు అమలు చేస్తారో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని బొల్లారం మున్సిపాలిటీ బిజెపి నాయకులు ఆనంద్ కృష్ణ రెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి పేదవాడికి 20 వేల రూపాయలు వెంటనే ప్రభుత్వం అందజేయాలని డిమాండ్ చేశారు. కష్ట కాలంలో ప్రతి పేదవాడికి అండగా నిలవాలని ప్రభుత్వానికి హితవు పలికారు. కరోనా కష్టాలు తీరే వరకు ప్రతి పేదవాడికి సాయం అందించాలన్నారు. అప్పుడే పేదవారు బయటికి రాకుండా ఇంట్లోనే ఉండి కరోనా జయిస్తారన్నారు. ప్రభుత్వం వెంటనే ప్రతి పేదవాడికి ఆర్థిక సాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.

0 Comments