కరోనాతో మహిళ మృతి మున్సిపల్ సిబ్బంది అంత్యక్రియలు
బొల్లారం తెలంగాణ సాక్షి న్యూస్:-
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో నీ అరో వార్డ్ కు చెందిన లక్ష్మి బాయి (45) వయస్సు గల మహిళ కరోనా వ్యాధితో బాధపడుతూ సోమవారం తెల్లవారు జామున మృతి చెందింది. అయిన వారు ఎవరూ కూడా దరికి రాకపోవడంతో అనాధగా పడివున్న ఆ మహిళ మృతదేహా న్ని ఆటోలో తరలించి మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ వెంటనే సిబ్బందితో కలిసి పీ పీ ఈ కిట్లు ధరించి అంతిమ దహన సంస్కారాలు దగ్గరుండి నిర్వహించారు. అనంతరం ఆయన మృతురాలి ఇంటి పరిసరాల్లో, కాలనీ మొత్తం పారిశుద్ధ్య కార్మికుల చేత సోడియం హైపోక్లోరైడ్ రసాయనాన్ని పిచికారి చేయించి శుద్ధి చేయించారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని శానిటరీ ఇన్స్పెక్టర్ సూచించారు.

0 Comments