నకిలీ ఆర్ఎంపీ,పిఎంపిల భారతం పడుతాం
తెలంగాణ సాక్షి న్యూస్
ప్రవేటు ఫాస్టేడ్ సెంటర్ నడుపు ,పిఎంపిలు ప్రభుత్వ శిక్షణ పొంది ఉండాలి
అర్హత లేని ఆర్ఎంపీలు వైద్యం అందివ్వరాదు
బెంగాలీ కలకత్తా కర్ణాటక ఆర్ఎంపీలుకు జిల్లా వైద్యాధికారి అనుమతి తప్పని సరి ఉండాలి
ఆర్ఎంపీ ఫాస్టెడ్ వైద్యమే మాత్రమే అందించాలి
సూదులు సెలనాలు మందులు ఇవ్వరాదు
రోగులకు హై డోసు ఇంజెక్షన్ ఇవ్వటం నెరామే
ప్రిస్స్కేప్షన్ లేకుండా మెడికల్ షాప్స్ లో మందులు ఇవ్వరాదు
జిల్లా వైద్య అధికారి గాయత్రి దేవి
ప్రజలకు మేలైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. వివిధ పత్రికల్లో వస్తున్నా కథనాల పై స్పందించారు. జిల్లా అన్ని మున్సిపాలిటీలల్లో అత్యాధునిక వైద్య సేవలు అందించేదుకు కేంద్ర ఆసుపత్రు లను ,గ్రామీణ ప్రాంతాల్లో పి హెచ్ సి సెంటర్లలో క్వాలిఫైడ్ సిబ్బంది ఏర్పటు చేసి ఉచిత వైద్యం అందిస్తుంది.ఆసుపత్రులల్లో
వైద్య సేవలను అందిచే వారికి ప్రజల్లో అత్యంత గౌరవం అందిస్తున్నారు. ఇటీవల ప్రజల వైద్య అవసరాలను ఆసరగా చేసుకొని సదాశివపేట, మున్సిపాలిటీ కొండాపూర్ ,కంది మండలాల్లో నకిలీ బెంగాలీ వైద్యం పేరున వెలసి వైద్యం అందించి సొమ్ము కొట్టున్నారని తమ దృష్టికి వచ్చిందని. సదశివాపేటకు యువత నాయకులు అరుణ్ కుమార్, నవీన్ రంజిత్ చెందిన ప్రజలు జిల్లా వైద్య అధికారికి పిర్యాదులు ఇచ్చారు. ఇతర రాష్టాల్లో నకిలీ వైద్య ట్రేనింగ్ సర్టిఫికేట్లను చూపి గ్రామాల్లో సర్ఫంచ్ ల సహకారం తీసుకొని తో ఆర్ఎంపీ పిఎంపి , పేరున క్లినిక్ లను ఏర్పటు చెస్తున్నారని తెలిపారు. జ్వరం నొప్పులు సర్ధికి మందులు ఇస్తామని చెప్పి క్లినిక్ లను ఏర్పటు చెస్తున్నారని పేర్కొన్నారు.క్లినిక్ లు పెట్టగానే వైద్యం పేరున సెలన్ అధిక డోస్ మందులు రోగులకు ఎలాంటి ప్రిస్కప్షన్ లేకుండానే మందులు వ్రాస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగటం ఆడటం సరైయింది కాదని తెలిపారు. ప్రజల పై అనవసర మైన మందులు వ్రాసి సొమ్ము చేసుకోవడం కొందరు ప్రవేట్ ల్యాబ్ లతో సంబంధాలు ఏర్పటు చేసుకోని కమిషన్ ల కోసం ల్యాబ్ లకు పంపు తున్నారనే విషయలు దృష్టి కి వచ్చిందని పేర్కొన్నారు.తెలియని వైద్యం పొంది రోగులు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలుస్తోంది.ఆర్ ఎంపీలు తెలియని వైద్యం అందించి ,రోగం ముదిరిపోవడం వల్లే ఎక్కవ అవస్థలు లోనవుతున్నారని తెలుస్తోందిని తెలిపారు.
బెంగాల్, కేరళ ,కర్ణాటక, రాష్టలకు చెందిన వారు,కంది,కొండాపూర్ తెర్పోల్ ,ఆత్మకూర్, బొబ్బిలి గామా, కోలూకూర్ గ్రామాల్లో ఫాస్టెడ్ క్లినిక్ ఏర్పటు చేసి నకిలీ వైద్యం అందిస్తున్నారానే తగిన సమాచారం ఉందాని తెలిపారు.జిల్లా వైద్య అధికారి జిల్లా ఎస్పీకి అన్ని మండలాల సర్కిల్ ఇన్స్పెక్టర్ లకు నకిలీ డాక్టర్లకు నోట్ వ్రాయడం జరిగిందని త్వరలో సిబ్బంది తో స్పెషల్ డ్రవ్ చేపట్టి నకిలి ఆర్ ఎంపి క్లినిక్ ల పై చెర్యాలు చేపట్టనున్నామని పేర్కొన్నారు. ప్రజలు నకిలీ క్లినిక్ లల్లో వైద్యం కోసం వెళ్లి ఇబ్బంధులు తెచ్చు కోవోద్దని సూచించారు. గ్రామాల్లో ఫాస్టెడ్ క్లినిక్ పెట్టాలన్న జిల్లా వైద్య అధికారి అనుమతి తప్పసారి ఉండాలన్నారు.లేని వారి పై కఠిన చెర్యాలు చేపట్టు తమని పేర్కొన్నారు. సదాశివపేటలో నకిలీ డాక్టర్లకు బినామీ మందులు అందిస్తున్నా మెడికల్ షాపుల పై ప్రత్యేక నిఘను ఏర్పటు చేస్తామని అన్నారు. నకిలీ మందులు అందించి ప్రజా ఆరోగ్యాలును దెబ్బ తీస్తున్నా వారిపై కఠిన చెర్యాలు తప్పవని హెచ్చరించారు.

0 Comments