Wanted Reporters

Wanted Reporters

💥హైదరాబాద్ జూపార్క్‌లోని సింహాలకు కరోనా.. జూ మూసివేత💥

తెలంగాణ సాక్షి న్యూస్

హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న వేళ హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో 8 ఆసియా సింహాలు కరోనా బారినపడడం కలకలం రేపుతోంది. సింహాల్లో కరోనా లక్షణాలు కనిపించడంతో గత నెల 24న నమూనాలు సేకరించిన జూ అధికారులు వాటిని పరీక్షల నిమిత్తం సీసీఎంబీకి పంపించారు. తాజాగా, పరీక్షల ఫలితాలు వచ్చాయి. ఆ ఎనిమిది సింహాలకు కరోనా వైరస్ సంక్రమించినట్టు నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు సింహాలను ఐసోలేషన్‌లో ఉంచారు. అలాగే, వాటికి అవసరమైన చికిత్స అందిస్తున్నారు. సింహాలు సాధారణంగానే ఉన్నాయని, బాగానే ఆహారం తీసుకుంటున్నాయని జూ అధికారులు తెలిపారు. అలాగే, ముందు జాగ్రత్త చర్యగా సందర్శకులను నిలిపివేశారు. 

Post a Comment

0 Comments

Ad Code