Wanted Reporters

Wanted Reporters

గుమ్మడిదల కొనుగోలు కేంద్రాల వద్ద అకాల వర్షానికి తడిసి ముద్దైన ధాన్యం బస్తాలు..అవేదనలో రైతులు

గుమ్మడిదల, తెలంగాణ సాక్షి న్యూస్:-

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల వద్ద



ధాన్యం బస్తాలు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి.  శనివారం మధ్యాహ్నం కురిసిన అకాల వర్షాలకు ధాన్యం బస్తాలు పూర్తిగా తడిసిపోయాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. పండించిన ధాన్యాన్ని అమ్మేందుకుఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద వేచి ఉన్నవారికి ఈ పరిణామంతో ఆందోళన చెందుతున్నారు. ఒక్కసారిగా కురిసిన వర్షానికి భారీ గాలులు తోడై ధాన్యం బస్తాలు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. అధికారులు సకాలంలో చర్యలు తీసుకుంటేఇలాంటి దుస్థితి ఎదురయ్యేది కాదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment

0 Comments

Ad Code