పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు
గుమ్మడిదల తెలంగాణ సాక్షి న్యూస్:-
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం రామ్ రెడ్డి బాయి గ్రామంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆదేశాల మేరకు జడ్పిటిసి కుమార్ గౌడ్ పలు సిసి రోడ్ల ప్రతిపాదనను పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పటాన్ చేరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాలనే సదుద్దేశంతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పనిచేస్తున్నారని ఆయన అన్నారు కార్యక్రమంలో భాగంగానే రామ్ రెడ్డి బాయి గ్రామంలో సుమారు 900 మీటర్ల సీసీ రోడ్డు పనులను తన సొంత నిధులతో ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సద్ది విజయభాస్కర్ రెడ్డి, దామోదర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, పద్మా రెడ్డి,మరియు గ్రామ కార్యదర్శి మరియు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు

0 Comments