2021
బొంతపల్లి రసాయన పరిశ్రమలో ప్రమాదం కార్మికుడికి తీవ్రగాయాలు, పరిస్థితి విషమం
గుమ్మడిదల తెలంగాణ సాక్షి న్యూస్:-
గుమ్మడిదల మే 25: బొంతపల్లి పారిశ్రామిక ప్రాంతంలోని ఓ పరిశ్రమలో ప్రమాదం సంభవించి కార్మికుడికి తీవ్రగాయాలైన సంఘటన మంగళవారం రాత్రి 8 గంటలకు చోటు చేసుకున్నది. ఎస్ఐ విజయకృష్ణ వివరాల ప్రకారం బొంతపల్లి పారిశ్రామికవాడలోని ఓ పరిశ్రమలో రోజు మాదిరిగానే మహేంద ర్రెడ్డి అనే కార్మికుడు విధుల్లో చేరాడు. పరిశ్రమలోని రియాక్టర్ వద్ద క్లీనింగ్ చేస్తుండగా రియాక్టర్లో ఒక్కసారిగా ఒత్తిడి పెరిగి ప్రెషర్ బయటకు రావ డంతో ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ ఘటనలో మహేందరకు తీవ్రగా యాలు కాగా, వెంటనే హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.


0 Comments