*రేపు ఉమ్మడి మండలాలలో ఎమ్మెల్యే జిఎంఆర్ పర్యటన*
గుమ్మడిదల తెలంగాణ సాక్షి న్యూస్:-
సంగారెడ్డి జిల్లా జిన్నారం, గుమ్మడిదల మండలలో శుక్రవారం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పర్యటించనున్నట్లు ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు రాజేష్, నరేందర్ రెడ్డి సంయుక్తంగా వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పాల్గొనే కార్యక్రమాల వివరాలు ఈ సందర్భంగా వారు వెల్లడించారు. జీలుగు విత్తనాల పంపిణీ ఈ నేపథ్యంలో ఉదయం 8 గంటలకు జిన్నారం మండలం సోలక్పల్లిలో విత్తనాల పంపిణీ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఉదయం 8 గంటల30 నిమిషాలకు గుమ్మడిదల సొసైటి కార్యాలయం ఆవరణలో విత్తనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు పార్టీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మండలంలోని అధికారులు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు సకాలంలో హాజరు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

0 Comments