Wanted Reporters

Wanted Reporters

అజిత్ సింగ్ మృతిప‌ట్ల తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంతాపం


 హైద‌రాబాద్  తెలంగాణ సాక్షి న్యూస్: ఆర్ఎల్డీ అధినేత‌, కేంద్ర మాజీ మంత్రి చౌద‌రి అజిత్ సింగ్ మృతిప‌ట్ల తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. మాజీ ప్ర‌ధాని చ‌ర‌ణ్ సింగ్ వార‌స‌త్వాన్ని అజిత్ సింగ్ స‌మ‌ర్థంగా కొనసాగించారు అని పేర్కొన్నారు. రైతు నేత‌గా దేశ రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేశారు. తెలంగాణ ఉద్య‌మానికి, ప్ర‌త్యేక రాష్ర్ట ఏర్పాటు కోసం జ‌రిగిన రాజ‌కీయ‌ ప్ర‌క్రియ‌కు అజిత్ సింగ్ సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించార‌ని తెలిపారు. తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు మ‌ద్ద‌తు ప‌లికిన అజిత్ సింగ్ జ్ఞాప‌కాల‌ను రాష్ర్ట ప్ర‌జ‌లు ఎప్ప‌టికీ గుర్తుంచుకుంటారు అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. 

Post a Comment

0 Comments

Ad Code