Wanted Reporters

Wanted Reporters

కొవిడ్ బాధితులకు ఇచ్చే రెసివిర్ ఇంజెక్షన్ల అధిక ధరల అమ్మకాలను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు

  కొవిడ్ బాధితులకు ఇచ్చే రెసివిర్ ఇంజెక్షన్ల అధిక ధరల అమ్మకాలను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు


సంగారెడ్డి తెలంగాణ సాక్షి న్యూస్:-

చేపడుతున్నట్లు సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షిషా, డీఎంహెచో గాయత్రితో పాటు ఆర్డీవోలు, డ్రగ్ ఇన్స్పెక్టర్లు తదితర అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా బాధితులకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో అందిస్తున్న చికిత్సలు, వారి నుంచి వసూలు చేస్తున్న ఫీజులు విర్ ఇంజెక్షన్ల నిల్వలు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ జిల్లాలోని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో రెసివిల్ ఇంజెక్షన్ల నిల్వలు ఉన్నప్పటికి బాధితులను బయట నుంచి తీసుకురావాలని పంపిస్తున్నారని, అధిక ధరలను కూడా వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయమై జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలో కొవిడ్ బాధితులకు చికిత్స అందిస్తున్న అన్ని ప్రైవేట్ ఆసుపత్రులను నోడల్ అధికారులు వెంటనే ఏకకాలంలో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. మంత్రి హరీశ్రావు పర్యవేక్షణలో అన్ని విధాల కొవిడ్ బాధితులకు జిల్లా యంత్రాంగం అండగా ఉందని ఆయన స్పష్టం చేశారు. రెమసివిర్ ఇంజెక్షన్లు, చికిత్స, బెడ్లకు అధికంగా ఫీజు వసూలు చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అధిక ఫీజులు వసూలు చేస్తే పీడీ యాక్టు కింద చర్యలు తీసుకుంటామని చెప్పారు. కరోనా బాధితులు అధైర్యపడి భయాందోళనకు గురికావొద్దని, వారికి అన్ని విధాలా భరోసా కల్పించే విధంగా ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ రాజర్షిషాకు సూచించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో రెమసివిర్ను అధిక ధరలకు విక్రయించినా, స్టాక్ లేదని తెలిపినా కొవిడ్ కంట్రోల్రూం నంబర్ 08455272233కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కలెక్టర్ సూచించారు. టెలీకాన్ఫరెన్స్లో


అదనపు కలెక్టర్ రాజర్షిషా, డీఎంహెచ్వో డాక్టర్ గాయత్రి,

ఆర్డీవో మెంచు నగేష్, అధికారులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments

Ad Code