బొల్లారం తెలంగాణ సాక్షి న్యూస్:-
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో కరోనా రోగులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో పరిశ్రమల ప్రతినిధులు ముందుకు రావడం పట్ల మున్సిపల్ చైర్ పర్సన్ కోలన్ రోజా బాల్ రెడ్డి అభినందించారు. రోజురోజుకు కరోనా వృద్ధి పెరుగుతున్న నేపథ్యంలో రోగులకు ఇమ్యూనిటీని పెంచే డ్రై ఫ్రూట్స్ ను పరిశ్రమ ప్రతినిధులు చైర్ పర్సన్ సమక్షంలో కమిషనర్కు అందజేశారు. ప్రతిరోజు డై ఫ్రూట్స్ బ్రెడ్ పండ్లు అందించే విధంగా సహకరించాలని కంపెనీస్ అసోసియేషన్ కార్యదర్శి ఆనందరావు ఈ సందర్భంగా ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేంద్ర కుమార్ పరిశ్రమల ప్రతినిధులు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు..

0 Comments