*ఆసుపత్రిలో రసాయనాల పిచికారి
*
బొల్లారం తెలంగాణ సాక్షి న్యూస్ ఏప్రిల్29:-
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో రెండో దశ కరోనా నివారణ చర్యల్లో భాగంగా మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. కరోనా నివారణ చర్యలను కమిషనర్ రాజేంద్ర కుమార్ దగ్గరుండి పర్యవేక్షించారు. మున్సిపాలిటీ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పారిశుద్ధ్య కార్మికుల చే సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఆసుపత్రిలోని పరిసరాలను రసాయనాలతో శుద్ధి చేశారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్, పర్యావరణ అధికారి సాయి కిరణ్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

0 Comments