తెలంగాణ సాక్షి న్యూస్:-
కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చిలనే డిమాండ్ తో దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే సీతక్కను పోలీసులు అరెస్ట్ చేశారు.
పేదలకు కూడా ప్రైవేటు వైద్యం అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్క్ లోని ధర్నా చౌక్ వద్ద సీతక్క రెండ్రోజులుగా దీక్ష చేస్తున్నారు.
ఆమరణ దీక్ష చేస్తున్న సీతక్క బాగా నీరసించిపోయారు.దీంతో పోలీసులు దీక్ష మధ్యలోనే సీతక్కను అరెస్ట్ చేశారు.కరోనా పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు పేదలను పీల్చి పిప్పి చేస్తున్నాయని, ప్రభుత్వ వైద్యం సరిగ్గా అందటం లేదని సీతక్క ఆరోపించింది.ప్రైవేటులో బెడ్స్ దొరక్కా లక్షలకు లక్షలు ఫీజులు కట్టలేక, ప్రభుత్వాసుపత్రికి వెళ్లలేక జనం ఇబ్బందిపడుతున్నారని సీతక్క ఆవేదన వ్యక్తం చేసింది.ఏపీలో ఇప్పటికే కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చారని గుర్తు చేసిన సీతక్క తెలంగాణలో కూడా చేర్చాల్సిందేనని డిమాండ్ చేశారు.ఎన్.ఎస్.యూ.ఐ ప్రెసిడెంట్ వెంకట్ తో కలిసి సీతక్క దీక్ష చేపట్టారు.సీతక్క దీక్షకు మాజీ ఎమ్మెల్సీ, విద్యావేత్త చుక్కా రామయ్య సంఘీభావం ప్రకటించారు.

0 Comments