కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంభాలకు 2 లక్షల రూపాయల తక్షణ ఆర్థిక సహాయం.. అల్లం నారాయణ
తెలంగాణ సాక్షి న్యూస్:-
కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంభాలకు రెండు లక్షల రూపాయల తక్షణ ఆర్థిక సహాయం. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (TUWJ - H143), ఇతర జర్నలిస్టు సంఘాల విన్నపం మేరకు ఈ నిర్ణయం. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న తరుణంలో కేవలం గత 10 రోజుల సమయంలోనే 15 మంది జర్నలిస్టులు కరోనా బారిన పడి మరణించిన దృష్ట్యా తెలంగాణ మీడియా అకాడమి ఈ కీలక నిర్ణయం తీసుకున్నది. కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంభాలు రెండు లక్షల ఆర్థిక సహాయం కోసం తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి కార్యలయానికి మే, 10వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారితో కరోనా మరణ ధృవీకరణ పత్రం, అక్రిడిటేషన్ కార్డు, కరోనా పాజిటివ్ రిపోర్టులతో పాటు ఆయా జిల్లాల డి.పి.ఆర్.ఒ దృవీకరించవలసి ఉంటుంది. దరకాస్తులు పంపవలసిన చిరునామా : కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ, ఇంటి నెంబర్ : 1-2-1, సమాచార భవన్, 2వ అంతస్తు, ఎ.సి.గార్డ్స్, మాసాబ్ ట్యాంక్, తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ది సంస్థ కాంప్లెక్స్, హైదరాబాద్. ఇతర వివరాలకు టెలిఫోన్ నెంబర్ : 040-23298672/74.

0 Comments