ప్లాస్మాదానం చేసిన యాదవరెడ్డిని సన్మానించిన జహీరాబాద్ డిఎస్పీ శంకర్ రాజు,
సంగారెడ్డి తెలంగాణ సాక్షి న్యూస్:-
ఇటీవల సంగారెడ్డి బాలజీ ఆసుపత్రిలో కరోనాతో చికిత్స పోందుతున్నరోగికి ప్లాస్మాదానం చేసిన జహీరాబాద్ వాసి యాదవరెడ్డికి మంగళవారం స్థానిక ఆసుపత్రిలో డిఎస్పీ శంకర్ రాజు,ఆసుపత్రి ఎండి డాక్టర్ శ్రీధర్ లు శాలువ,పూల మాలలతో ఘనంగా సన్మానించి సత్కరించారు.ఈ సందర్బంగా వారు మాట్లడుతూ సంగారెడ్డి భాలజీ ఆసుపత్రిలో కరోనా చికిత్స పోందుతున్న రోగికి అత్యవసరంగా ప్లాస్మాదానం చేసి ఆదుకోన్న యాదవరెడ్డిని వారు అభినందించారు.కరోన వచ్చి తగ్గిన వారు భయ పడకుండా వేంటి లేటర్ పై ఉన్న వారకి ప్లాస్మాదానం చేస్తే వారిలో ఆంటీబడీస్ వృద్ది చేంది ఆరోగ్యంగా ఉంటారన్నారు. ప్లాస్మాదాత యాదవరెడ్డిని స్పూర్తిగా తీసుకోని ఆరోగ్యవంతులై వారు ఆపదలో ఉన్న రోగులను ఆదుకోవాలని సూచించారు. కరోనా బారిన పడిన వారు బయటికి రాకుండ చూడటం మన కర్తవ్య మన్నారు.వారికి అవసరమగు సరకులు, మందులు అందించడంతో పాటు ఎదైన సహయం కావల్సి వస్తే తమంత ఉన్నమని బరోసా కల్పించాలని కోరారు. ప్రజలు కరోన బారీన పడకుండా ఉండేందు కోసం తప్పని సరిగ్గ మాస్కూలను ధరించాలని సూచించారు.
ప్లాస్మాదాత యాదవరెడ్డి మాట్లడుతూ కరోనా రోగికి స్లాస్మాదానం చేసి రక్షించడం పట్ల తనకు సంతోషంగా ఉందన్నారు.తను ప్లాస్మదానం చేసిన తనకు ఎలాంటి ఆనారోగ్యం కల్గలేదన్నారు.ఈ సన్మాన కార్యక్రమంలో ఆరాధన్ రెడ్డి,మేనేజర్ మల్లేషం తదితరులు పాల్గోన్నారు.


0 Comments