గుమ్మడిదల మండల కేంద్రంలో ఘనంగా టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం
గుమ్మడిదల తెలంగాణ సాక్షి :-
గుమ్మడిదల మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షులు యం.నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్ )పార్టీ ఆవిర్భావ దినోత్సవం కోవిడ్ నిబంధనలతో నిరాడంబరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ చేశారు. 2001లో పార్టీ స్థాపించిన సమయంలో ఆ పార్టీ మున్నా ల ముచ్చటే అంటూ చాలా మంది చాలా రకాలుగా హేళన చేసిన ,ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ముందుకు నడిపించిన వ్యక్తి కెసిఆర్ అని మండల అధ్యక్షుడు యం. నరేందర్ రెడ్డి పేర్కొన్నారు ప్రత్యేక రాష్ట్రం కావాలనే ఉద్దేశంతో సత్యాగ్రహం చేసి ప్రాణాలు త్యాగం చేయడానికి ఆయన ముందుకు వచ్చిన వ్యక్తి కేసీఆర్ అని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కల సాకారం చేసిన నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అని టిఆర్ఎస్ పార్టీ నాయకులు గుర్తు చేశారు. తెరాస నేతలంతా టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు నాయకులకు, కార్యకర్తలకు ప్రజలకు, తెలిపారు. ఇందులో ముఖ్య అతిథులుగా జెడ్పిటిసి కుమార్ గౌడ్,గుమ్మడిదల సర్పంచ్ చిమ్ముల నరసింహారెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు రవికాంత్ రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు కర్ణాకర్ గౌడ్, మండల యూత్ ఉపాధ్యక్షులు కవ్వం రవీందర్ రెడ్డి మరియు పడమటి రవీందర్ రెడ్డి, వార్డుమెంబర్లు కలకంటి రవీందర్ రెడ్డి, ఆకుల సత్యనారాయణ, బండల భాస్కర్, రాము, నాయకులు నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి, అమ్మగారి రవీందర్ రెడ్డి, కొండల్ రెడ్డి, దాసరి ఆంజనేయులు, నడిమింటి అంజనేయులు, పోచయ్య మరియు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.

0 Comments