లక్షణాలు ఉంటే నే టెస్ట్‌లకు రావాలి : డీహెచ్
హైదరాబాద్ తెలంగాణ సాక్షి న్యూస్:-
హైదరాబాద్: గత వారం నుంచి రాష్ట్రంలో పరిస్థితులు కుదుటపడుతున్నాయని తెలంగాణ వైద్యారోగ్య సంచాలకులు శ్రీనివాస్ తెలిపారు. ప్రజలందరు సహరిస్తున్నారని, రాష్ట్రంలోని కేసుల్లో స్థిరత్వం ఉందని అన్నారు. వచ్చే మూడు, నాలుగు వారాలు కీలకమని ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని కోరారు. విరేచనాలు, జ్వరం, వాసన, రుచి కోల్పోవడం వంటి లక్షణాలు ఉన్నవారే టెస్ట్‌లకు రావాలని సూచించారు. లక్షణాలు లేకుండా పరీక్షల కోసం వచ్చి వైరస్ బారినపడుతున్నారని డీహెచ్ అన్నారు. కరోనా పరీక్షలు, చికిత్సకు సంబంధించి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, అవగాహన పెంచుకోవాలి సూచించారు

0 Comments