*గుమ్మడిదల లో 26 పాజిటివ్ కేసులు నమోదు*
గుమ్మడిదల తెలంగాణ సాక్షి న్యూస్:-
గుమ్మడిదల మండలం లో కరోనా కేసులు విలయతాండవం చేస్తున్నాయి. బుధవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నమోదైన కేసుల వివరాలను వైద్యుడు శ్రీధర్ పేర్కొన్నాడు. మొత్తం 54 టెస్టులు నిర్వహించగా 26 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. గుమ్మడిదల లో 8, బొంతపల్లి లో 10, అన్నారం లో 4, దోమడుగు లో 3, నల్లవల్లి లో 1 చొప్పున పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆయన పేర్కొన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి శానిటైజర్ ఉపయోగించుకొని సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వ వైద్యులు డాక్టర్ శ్రీధర్ తెలిపారు. ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ టీకా తీసుకోవాలని కోరారు.

0 Comments