దాతలు ముందుకు వచ్చి నిండు ప్రాణాన్ని కాపాడండి జిల్లా ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షుడు సూపల శ్రీనివాస్
సంగారెడ్డి తెలంగాణ సాక్షి న్యూస్:-
సంగారెడ్డి జిల్లాలో కరోనా సెకండ్ వేవ్ చాలా ఉగ్రరూపంలో ఉండి లక్షణాలు బయటకి కనబడకుండా ప్రజల ప్రాణాలను హరించి వేస్తుందని జిల్లా ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షుడు సూపల శ్రీనివాస్ అన్నారు. బుధవారం విలేకరులతో అయన మాట్లాడుతూ.. ఊపిరితిత్తులలోకి కరోనా సోకి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగారెడ్డి పట్టణానికి చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ కె.చంద్రశేఖర్ ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు రావాలని దాతలకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ లోని ప్రముఖ హాస్పిటల్లో (మెడికవర్)లో వైద్య సహాయం పొందుతున్నాడని, లక్షల రూపాయలు ఖర్చు అవుతాయని వైద్యులు వెల్లడించారని తెలిపారు. శేఖర్ పేద కుటుంబానికి చెందినవాడని, అతని కుటుంభం డబ్బులు లేక బాధ పడుతున్నారని తెలిపారు. ఆర్థిక సహాయం అందించడానికి దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తమ ఆర్థిక పరిస్థితి బాగాలేదని అతని సతీమణి కె.భవాని తెలిపారు. తమ స్థాయికి మించి ఆసుపత్రి చార్జీలు అవుతున్నాయని, వారికి మంచి వైద్యం అందడానికి తమకు ఆర్థిక సహాయం చేయవలసిందిగా దాతలకు విజ్ఞప్తి చేశారు. దయగల వారు ఎవరైనా సహాయం చేయాలని ఆమె కోరారు. కె.భవాని A/c.33459773644, IFSC:SBIN 0015519, ఎస్బిఐ బ్యాంక్ బైపాస్ రోడ్డు బ్రాంచ్, సంగారెడ్డి, గూగుల్ పే, ఫోన్ పే 9441264667. దాతలు తోచిన సహాయం అందించి అండగా నిలవాలని కోరారు.

0 Comments