Wanted Reporters

Wanted Reporters

దేశంలో మరో హృదయవిదారక ఘటన

 దేశంలో మరో హృదయవిదారక ఘటన



తెెెలంగాణ సాక్షి:-


దేశంలో పలు ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ వచ్చిన పేషెంట్లకు ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ దొరకడం లేదు. ఈ నేపథ్యంలో చాలా మంది ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి హృదయ విచారక ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో చోటు చేసుకుంది. కరోనా పాజిటివ్ వచ్చిన ఓ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో అతడి భార్య ఆటోలో ఆస్పత్రికి తీసుకువెళ్లింది. కానీ ఆస్పత్రిలో బెడ్ లేదని చెప్పడంతో ఏదో విధంగా తన భర్తకు వైద్యం అందించాలని వైద్యులను వేడుకుంది. కానీ ప్రయోజనం కనిపించలేదు.
మరోవైపు తన భర్తకు ఆక్సిజన్ సరైన స్థాయిలో అందకపోతుండటంతో ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా తయారైంది. *దీంతో ఆమె కరోనాను కూడా లెక్కచేయకుండా నోటి ద్వారా తన భర్తకు శ్వాస అందించేందుకు ప్రయత్నించింది.*
కానీ చివరకు ఆమె భర్త ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన చూసిన స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. కాగా ఈ ఘటన దేశంలోని కరోనా పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పకనే చెప్తుందంటూ పలువురు సోషల్ మీడియా ద్వారా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

Post a Comment

0 Comments

Ad Code