మానవత్వం చాటుకున్న స్నేహితులు.
గుమ్మడిదల తెలంగాణ సాక్షి:-
తమతో కలిసి చదువుకున్న స్నేహితుడు అనారోగ్యంతో అకస్మాత్తుగా మృత్యువాత పడ్డారు. ఈవిషయం తెలుసుకున్న కలిసి చదువుకున్న స్నేహితులు మృతిచెందిన స్నేహితుడి కుటుంబానికి బాసటగా నిలిచారు. స్నేహితులంతా కలిసి స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి మేమున్నామని కుటుంభ సభ్యులకు ధైర్యాన్ని ఇచ్చారు. గుమ్మడిదల మండలం మంబాపూర్ గ్రామానికి చెందిన చిన్నపోచి కొమురేష్ అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మరణించాడు. విషయం తెలుసుకున్న 10 వ తరగతిలో కలిసి చదువుకున్న స్నేహితులు చలించిపోయారు. చిన్న వయస్సులో స్వర్గస్తుడైన దోస్టు కుటుంబానికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో స్నేహితులంతా కలిసి 21000 రూపాయలను కుటుంభ సభ్యులకు అందజేసి ఓదార్చారు. ఇలా స్నేహితుడిని పోగొట్టుకోవడం దురదుష్టకరమని ఆవేదన వ్యక్తం చేస్తు నివాళులర్పించారు. గోపాల్ , నారాయణ యాదవ్, అశోక్, రవిందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

0 Comments