కాంగ్రెస్ పార్టీలో సీట్లు పదవుల గొడవలు తప్ప పాలనపై అవగాహన లేదు చంటి క్రాంతి కిరణ్
చిన్న చెల్మెడ గ్రామంలో ఇప్పటివరకు రెండు కోట్ల నిధులు కేటాయించి అభివృద్ధి చేశాం చంటి క్రాంతి కిరణ్
వాస్తవ తెలంగాణ న్యూస్ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి పవన్
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం మునిపల్లి మండలం పరిధిలోని చిన్న చెల్మెడ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పర్యటించిన చంటి క్రాంతి కిరణ్ తెలంగాణ తల్లికి పూలమాలలు వేసి గ్రామస్తులు డప్పు చప్పులతో ఘనంగా స్వాగతం పలికారు.మునిపల్లి మండలం చిన్నచెల్మేడ గ్రామంలో ప్రజాప్రతినిధులతో బి ఆర్ ఎస్ నాయకులతో,కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఇంటింటికి తిరిగి మేనిఫెస్టో ను ప్రజలకు వివరించిన అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఈ సందర్బంగా క్రాంతి కిరణ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమపథకాలను,మేనిఫెస్టో ను ప్రజలకు వివరించారు కారు గుర్తుకే ఓటువేయాలన్నారు.కారు గుర్తుకే మన ఓటు అంటూ నినాదాలు చేశారు గ్రామప్రజలు సానుకూలంగా స్పందిస్తూ కారుగుర్తుకే ఓటువేస్తామని తెలిపారు నవంబర్ 30 న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కారుగుర్తుకే ఓటువేసి భారీ మెజారిటీ తో గెలిపించాలని ప్రజలకు వివరించారు జెడ్పిటిసి మీనాక్షి సాయికుమార్ ఎంపీటీసీ రాజు పటేల్ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నాయకులు బిఆర్ ఎస్ పార్టీలో చేరారు పార్టీ కండువా కప్పి సాధారణంగా స్వాగ తించిన ఎమ్మెల్యే అభ్యర్థి చంటి క్రాంతి కిరణ్ చిన్న చెల్మేడ గ్రామానికి ఇచ్చిన హామీలు నెరవేర్చాను చాలా సంతోషంగా ఉంది గ్రామానికి ఇప్పటివరకు రెండు కోట్ల రూపాయల నిధులు కేటాయించి అభివృద్ధి చేశాం గతంలో ఉపముఖ్యమంత్రిగా ఉన్న దామోదర్ రాజనర్సింహ ఏం చేశారు ప్రజలు ఆలోచించాలి. ప్రజల్లో ఉండాలి అని కేసీఆర్ చెప్పిన మాట ప్రకారం నేను ప్రజల్లో ఉండి పని చేశాను వివిధ పథకాల కింద గ్రామానికి 10 కోట్లు ఖర్చు చేసాం కాంగ్రెస్లో సీట్లు పదవుల గొడవలు తప్ప పాలనపై అవగాహన లేదు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో తాగునీటి కోసం కరెంటు కోసం ధర్నాలు చేస్తున్నారు ఆలోచించండి ప్రజలారా కేసీఆర్ నాయకత్వాన్ని నమ్ముకుంటే భవిష్యత్తు ఉంటుంది చిన్న చెల్మేడ గ్రామంలో చర్చి గుడి మసీద్ నిర్మాణానికి నిధులు ఇస్తాను అని ఆమీ ఇచ్చారు
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు పైతర సాయికుమార్. పార్టీ మండల్ అధ్యక్షులు విజయ్ కుమార్. సీనియర్ నాయకులు శివశంకర్. పార్టీ ప్రధాన కార్యదర్శి శశికుమార్. సర్పంచ్ విజయభాస్కర్.ఎంపీటీసీ మంద రాజశేఖర్. ఏ ఎం సి వైస్ చైర్మన్ నారాయణ .పార్టీ వైస్ ప్రెసిడెంట్ గడ్డం భాస్కర్.సీనియర్ నాయకులు రాంచెందర్ రావు. పంతులు గౌరీగామ చెంద్రయ్య.మండల్ బిఆర్ ఎస్ యూత్ అధ్యక్షులు ఆనంద్ రావు.కురుమ సంగం మండల్నాయకులు పాండు. ఏఎంసి డైరెక్టర్ నాటుకారి మొగులయ్య. మాజీ సర్పంచ్ నరేష్.గ్రామ అధ్యక్షులు ఒగ్గు మోహన్.మాజీ సర్పంచ్ వీరన్న. నాయకులు పరమేశ్వర్. కార్యకర్తలుగ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

0 Comments