Wanted Reporters

Wanted Reporters

ముదిరాజుల మద్దతు బిజెపి కే

 ముదిరాజుల మద్దతు బిజెపి కే...

- కొల్చారం ముదిరాజ్ సంఘం అధ్యక్షులు అంజయ్య

• బి.సి నేతను ఎం ఎల్యే చేయడమే మా లక్ష్యం

• ముదిరాజులపై అసత్య ప్రచారాలు మానుకోవాలి



కొల్చారం వాస్తవ తెలంగాణ న్యూస్:



 మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారంలో నిర్మాణంలో ఉన్న పెద్దమ్మ ఆలయం వద్ద సోమవారం నాడు ముదిరాజ్ సంఘం నాయకులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు ఆశన్న గారి అంజయ్య ఇతర ముదిరాజ్ నాయకులు మాట్లాడుతూ నర్సాపూర్ గడ్డపై బీసీ నేత, బిజెపి అభ్యర్థి మురళి యాదవ్ ను గెలిపించాలని ఈనెల 16న తాము బిజెపి పార్టీలో చేరామని, గ్రామంలో 90 శాతం మంది ముదిరాజులను ఈ మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. కాగా ఆదివారం కొందరు బి ఆర్ ఎస్ కార్యకర్తలు మాలో ఒకరిద్దరిని వెంటబెట్టుకొని పోయి కొల్చారం ముదిరాజులు బి ఆర్ ఎస్ పార్టీలో చేరారని ప్రచారం చేసిన వార్తా కథనాలు అవాస్తవమని ఖండించారు. మాపై అసత్య ప్రచారాలు మానుకోవాలని, ఆరు నూరైనా సరే కొల్చారం గ్రామ ముదిరాజులం ఏకతాటిపై నిలిచి నర్సాపూర్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి మురళీధర్ యాదవ్ ను గెలిపిస్తామని స్పష్టం చేశారు. మాలో ఒకరిద్దరు ముదిరాజ్ నాయకులు తప్పటడుగులు వేయటం బాధాకరమని, ఏదేమైనా మాలో మేము సమన్వయం చేసుకొని మాట ఇచ్చిన ప్రకారం 90 శాతం ముదిరాజ్ ఓట్లు బిజెపికి వేయించి మురళి యాదవ్ కు ఇచ్చిన మాట నిలుపుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు ఆశన్న గారి అంజయ్య, గౌరవ అధ్యక్షులు నేరల్ల చంటయ్య, కోశాధికారి తెనుగు శేకులు, స్కూల్ చైర్మన్ కే. నాగరాజు, నాయకులు సారా సుదర్శన్, చింతల యాదగిరి, జె. రాజు, అరికెల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Ad Code