Wanted Reporters

Wanted Reporters

మండల వ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లో ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ

 *మండల వ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లో ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ*


వాస్తవ తెలంగాణ ప్రతినిధి నూగురు వెంకటాపురం నవంబర్ 26





ములుగు జిల్లా వెంకటాపురం

 మండలంలో కాంగ్రెస్ పార్టీ 

ప్రచారం స్పీడ్ అందుకుంది ఈనెల 30వ తారీఖున నిర్వహించ తలపెట్టిన ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాచలం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదేం వీరయ్య గెలుపుకాంక్షిస్తూ మండల వ్యాప్తంగా ఆదివారం పార్టీ శ్రేణులు సుడిగాలి పర్యటన చేశారు. ఇందులో భాగంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మండలంలోని ఏదిరా, ఎదిర ఎస్సీ కాలనీ, సూర వీడు రామంజరం, చొక్కాల ,లక్ష్మీనగరం, మరికాల, దానవాయిపేట, నుగూరు, నుగూరుకాలనీ, జల్లా కాలనీ, విప్పల గూడెం, యోగితా నగర్ తదితర గ్రామాల్లో  స్పీడుగా ఇంటింటి ప్రచారాన్ని కొనసాగించారు. ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో ఉన్న అంశాలని ఆరు గారెంటీలను  ఓటర్లకు వివరిస్తూ ఓటును అభ్యర్థించారు. హస్తం గుర్తుకే ఓటేసి పొదేం వీరయ్యను గెలిపించాలని ఓటర్లను కోరారు ఈ కార్యక్రమంలో మండల జడ్పిటిసి పాయం రమణ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్, బాలసాని శ్రీను, మన్యం సునీల్, నాగేశ్వరరావు, మద్దుకూరి ప్రసాద్, యువ నాయకులు బాలసాని వేణు, సీనియర్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Post a Comment

0 Comments

Ad Code