Wanted Reporters

Wanted Reporters

పిర్జాదిగూడ 2వ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్న ఓటర్లు...




మల్లారెడ్డికి మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించిన కార్పొరేటర్ సుభాష్ నాయక్.

మేడ్చల్లో రెండో సారి మంత్రి మల్లారెడ్డికి భారీ మెజారిటీ - సుభాష్ నాయక్.

మేడ్చల్ జిల్లా (వాస్తవ తెలంగాణ మేడిపల్లి/నవంబర్ :5)  మేడ్చల్లో రెండో సారి ఎమ్మెల్యే అభ్యర్థి చామకూర మల్లారెడ్డి గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 2వ డివిజన్ కార్పొరేటర్ సుభాష్ నాయక్ ఆదివారం నాడు రెండో డివిజన్ నాయకులు కార్యకర్తలతో కలసి డివిజన్ పరిధిలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు అనంతరం డివిజన్ నాయకులు కార్యకర్తలు యూవకులతో కలిసి బైక్ ర్యాలీగా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వరకు వెళ్లడం జరిగింది ఈ సందర్బంగా కార్పొరేటర్ సుభాష్ నాయక్ మాట్లాడుతూ మేడ్చల్లో రెండో సారి చామకూర మల్లారెడ్డి విజయం కొరకు ఎన్నికల ప్రచారం చేస్తు ఈ రోజు మా డివిజన్ నాయకులు కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లడం జరుగుతుందని ప్రజలు కూడా బిఆర్ఎస్ పార్టీని ఆదరిస్తున్నారని రెండో సారి మా మంత్రి చామకూర మల్లారెడ్డి మేడ్చల్లో భారీ మెజారిటీతో గెలవడం కాయం అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో 2వ డివిజన్ అధ్యక్షుడు పగడాల బాలరాజు,కార్యదర్శి వరికల శ్రీనివాస్, రాధా కిషన్, కూరేళ్ల ఉపేందర్,గంగులు, నరసింహ, నరసయ్య, శ్రీనివాస చారి, కిషోర్, శ్యామ్ సుందర్, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Ad Code