సంబురాలు జరుపుకున్న కాంగ్రెస్ నాయకులు
రోహిత్ గెలుపే ధ్యేయంగా పనిచేస్తాం
నిజాంపేట: వాస్తవ తెలంగాణ న్యూస్
మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మైనం పల్లి రోహిత్ కు భి పాం అందించినందుకు కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. మండల కేంద్రంలోని బస్టాండ్ అవరణలో ఆదివారం రోజు టపాకాయలు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మారుతి, మహేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలుపే ధ్యేయంగా మెదక్ అభ్యర్థి మైనం పల్లి రోహిత్ ను గెలిపించి మెదక్ కిల్లపై కాంగ్రెస్ జెండా ఎగురవే స్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నసిరొద్దిన్, వినోద్,వెంకటేష్, సులేమాన్, షానవాజ్, బాబు తదితులున్నారు.

0 Comments