Wanted Reporters

Wanted Reporters

వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి నిరుద్యోగులు గట్టిగా గుణ పాఠం చెప్పాలి

 *వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి నిరుద్యోగులు గట్టిగా గుణ పాఠం చెప్పాలి*  గోండ్ వాన రాష్ట్ర సంక్షేమ పరిషత్ పిలుపు    ,, 



వాస్తవ తెలంగాణ ప్రతినిధి నూగురు వెంకటాపురం అక్టోబర్ 7

ఆదివారం వెంకటాపురం మండల కేంద్రంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో పునెం సాయి అధ్యక్షతన సమావేశంలో గోండ్ వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన బతుకులు మారుతాయని  పచ్చి మాటలు చెప్పిన కెసిఆర్ నిధులు నియామకాలు ఇంటికో ఉద్యోగం ఇస్తామనీ నీతులు చెప్పిన కేసీఆర్ ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారన్నది స్వెతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఐదో షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసులకు ప్రత్యేకమైన చట్టాలు ఉన్నప్పటికీ ఆ చట్టాలను గౌరవించని కెసిఆర్ కు ఎందుకు ఓట్లు వేయాలిఅన్నారు .

ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వాలు ఆదివాసిచట్టాలను గౌరవించి ఆదివాసులకు తగు న్యాయం చేసే విధంగా కృషి చేసాయని

తెలంగాణ ఏర్పడిన తర్వాతనే రాష్ట్రంలో ఐటీడీ ఏ లను కెసిఆర్ ప్రభుత్వమే మొతం నిర్వీర్యంచేసారని

కెసిఆర్ కు దమ్ము ధైర్యం ఉంటే ఐటీడీఏ పరిధిలో స్పెషల్ డిఎస్సనీ నిర్వహించి ఆదివాసి నీరు ద్యోగులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

బూర్గంపాడు నుండి ఎటూరు నగరం వరకు గోదావరి పరివాహక ప్రాంతాలలో ఉన్నటువంటిఅక్రమ ఇసుక  బినామీ వ్యవస్థ ఏర్పడి కోట్లు గడిస్తున్నారని ఆదివాసులు మాత్రంకూలీలుగానే మిగిలిపోతున్నారని అధికార పార్టీ నాయకులే లబ్ధి పొందుతున్నారని అన్నారు

ఈ రాష్ట్రంలో దరిద్రపు ధరణి పోర్టలనుతీసుకొచి రైతులను ఆగమాగం చేసిన కెసిఆర్ కు రైతులు కూడా ఎలా బుద్ధి చెప్పాలో వేసి చూస్తున్నారని తెలియచేశారు. ఈ  కార్యక్రమంలో కాక సురేష్.పనేం సాయి దొర, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Ad Code