వాస్తవ తెలంగాణ ప్రతినిధి (నూగురు) వెంకటాపురం
ములుగు జిల్లా:రోడ్డు ప్రమాదంలో బాలుడి కి తీవ్ర గాయాలైన ఘటన వాజేడు మండలంలోని జగన్నాధపురం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన రోహిత్ (14)గ్రామంలో చర్చి సమీపంలో జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని ద్విచక్ర వాహనం డీకోట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు.గమనించిన స్ధానికులు బాలుడిని వెంటనే వాజేడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలుడు పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో బాలుడు తల్లిదండ్రులు ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు వాజేడు పోలీసులు.

0 Comments