*అర కొర పథకాలు అందజేసి చేతులు దులిపేసుకున్న ప్రభుత్వం*
*తెలంగాణ ప్రజలను నిలువునా ముంచేసిన కేసీఆర్ సర్కార్*
- మేడ్చల్ మండల బీజేపీ అధ్యక్షురాలు కృష్ణప్రియ మల్లారెడ్డి
మేడ్చల్ వాస్తవ తెలంగాణ
2018 ఎన్నికల ముందు తెలంగాణ ప్రజలకు అధికారంలోకి వస్తే ఇవి చేస్తాం, అవి చేస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం అర కొర పథకాలు అందజేసి చేతులు దులిపేసుకుందని మేడ్చల్ మండల బీజేపీ అధ్యక్షురాలు కృష్ణప్రియ మల్లారెడ్డి అన్నారు. ఈ సందర్బంగా సోమవారం ఆమె మాట్లాడుతూ ఎన్నికల ముందు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే నా తల నరుక్కుంటానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఆ తల ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. దళితులకు 50వేల కోట్లు, రైతులకు ఉచిత ఎరువుల పంపిణీ, డ్వాక్రా గ్రూపలకు 10లక్షలు, నిరుద్యోగ భృతి, 3 లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇంటికో ఉద్యోగం, కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్య, దళిత సాధికారత, రైతు రుణమాఫి, దళితులకు మూడెకరాల భూమి, వంటి పథకాలు అమలు చేశావా, చేస్తే ఎక్కడ అమలు చేశావో చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి అప్పుల తెలంగాణగా మార్చారని ఆవేధన వ్యక్తం చేశారు. ఇప్పుడు మళ్లి ఎన్నికలు రావడంతో అధికారం చేజిక్కించుకోవాలని అహంతో ప్రజలను మోసం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఈ నమ్మకద్రోహి కేసీఆర్ ను, బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇక ప్రజలను నమ్మబోరని, నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ సరైన బుద్ది చెప్తారన్నారు. కేంద్ర పథకాలను కూడా తెలంగాణ పథకాల కింద వాడుకున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు చావుదెబ్బకొట్టబోతున్నారని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ది తెలంగాణ లో బీజేపీ అధికారంలోకి రాగానే కేంద్రంలో జరిగిన అభివృద్ధే ఇక్కడ కూడా జరుగుతుందన్నారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఆశాభావం వ్యక్తం చేశారు.

0 Comments