*నందిగామలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణి*
* *నందిగామలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణి*
* నందిగామ గ్రామంలో 40 ఇండ్లు మంజూరు కాగా 62 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది.
* నిరుపేదలకు న్యాయం చేసే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం - ఎంపీపీ
నిజాంపేట్, వాస్తవ తెలంగాణ న్యూస్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల సంక్షేమం దృశ్య ఇల్లు లేని ప్రతి పేదవారికి ఇల్లు కట్టిస్తానని దృక్పథంతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేస్తుందని నిజాంపేట ఎంపీపీ దేశెట్టి సిద్ధరాములు తెలిపారు. ఈ మేరకు మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామంలో ఆదివారం నాడు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీపీ సిద్దరాములు మాట్లాడుతూ నిరుపేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకువస్తున్న ఏకైక ప్రభుత్వ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయన కొనియాడారు. మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి చొరవతో నిజాంపేట మండలానికి పలు సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తుందన్నారు. నందిగామ గ్రామంలో 40 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు కాగా 62 మంది నిరుపేదలు దరఖాస్తు చేసుకున్నారు. కాగా మండల ఎంపీపీ మాట్లాడుతూ అర్హత కలిగిన 40 మంది లబ్ధిదారులకు ఇండ్ల పంపిణీ చేయడం జరిగిందన్నారు.రానున్న కాలంలో నిరుపేదలకు మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేసే యోచనలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారని మండల ఎంపీపీ దేశెట్టి సిద్ధ రాములు అన్నారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ భరస నే గద్దనెక్కడం జరుగుతుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో నందిగామ సర్పంచ్ లద్దప్రీతి, లద్ద సురేష్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బాల్రెడ్డి, సాంగు స్వామి తదితర నాయకులు పాల్గొన్నారు.


0 Comments