Wanted Reporters

Wanted Reporters

ఇది చాలదా అధికారం దక్కదనే అక్కసుతోనే సంక్షేమ పథకాలపై దామోదర దుష్ప్రచారం:ఎమ్మెల్యే క్రాంతి కిరణ్





వాస్తవ తెలంగాణ న్యూస్ రవికుమార్ రిపోర్టర్: ఉమ్మడి పుల్కల్ మండల్ శివంపేట చెందిన దాదాపు 150 మంది కాంగ్రెస్  కార్యకర్తలు ఆందో ల్ MLA క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో ఈరోజు బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. చేరిన వారిలో ముదిరాజ్ సంఘం మాజీ అధ్యక్షులు అంబేద్కర్ సంఘం సభ్యులు అలాగే వివిధ యువజన సంఘాల నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతుంటే దామోదర్ రాజనర్సింహ రాజకీయాల కోసం ఇక్కడి ప్రజల మధ్య చిచ్చుపెట్టి పథకాలను ఆపించే కుట్ర చేస్తున్నారని క్రాంతి కిరణ్ ఆరోపించారు దళితుల అభ్యున్నతి కోసం దళిత బందును అమలు చేస్తుంటే కాంగ్రెస్ వారిని ఉరిగొల్పి, రెచ్చగొట్టి అందరికీ ఒకేసారి ఇవ్వాలంటూ అశాస్త్రీయమైన వాదనను ముందుకు తెస్తున్నాడు అని ఆరోపించారు. దామోదర్ రాజనర్సింహ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతి సంవత్సరం ఒక్కో మండలంలో  ఎంతమందికి ఎస్సీ కార్పొరేషన్ రుణాలు అందజేశాడో దమ్ముంటే బయటపెట్టాలని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ డిమాండ్ చేశారు . ఆయన ఉప మంత్రిగా ఉన్న సమయంలో సంవత్సరానికి ఒక గ్రామంలో రెండు మూడు కంటే ఎక్కువ ఎస్సీ కార్పొరేషన్ రుణాలు వచ్చేవి కాదని ఇప్పుడు ఒక మండలానికి 200 వరకు దళిత బంధు ఇస్తుంటే దామోదరపు వచ్చిన నొప్పి ఏంటి అని కాంతి కిరణ్ ప్రశ్నించారు. ఇలాంటి అసంబద్ధమైన వాదనలతో ప్రజలను ఆగం చేయిద్దని వాళ్ల జీవితాలతో ఆడుకోవద్దని ఆయన కోరారు.  బీసీ బందు, మైనార్టీ బందు ప్రజలకు మేలు చేస్తుందని, యాదవులకు గొర్రెలు పంపిణీ చేయడం వల్ల వారి ఆర్థిక పరిస్థితుల్లో మార్పు వచ్చిందని చేప పిల్ల పెంపకం వల్ల ముదిరాజ్ జీవితాల్లో కూడా మార్పులు వస్తున్న విషయాన్ని దామోదర్ రాజనర్సింహ గ్రహించి ప్రతిదాన్ని రాజకీయం చేయడం మానుకోవాలని ఆయన హితువు పలికారు.

Post a Comment

0 Comments

Ad Code