పలు గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు
ములుగు జిల్లా వాస్తవ తెలంగాణ ప్రతినిధి, వెంకటాద్రి (నుగూరు)వెంకటాపురం, సెప్టెంబర్ 21: ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ఎదిర ప్రభుత్వ వైద్యాధికారిణి డాక్టర్ భవ్య శ్రీ ఆధ్వర్యంలో మండలంలోని ముర్రవానిగూడెం, కొండాపురం, బోదాపురం, మరికాల, తదితర గ్రామాల్లో వైద్య బృందాలతో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా సుమారు 200 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి తగిన మందులు పంపిణీ చేశారు. రక్త నమూనాలను సేకరించి వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ భవ్య శ్రీ మాట్లాడుతూ ప్రజలు సీజన్ సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలని ఇంటి పరిసర ప్రాంతాల్లో మురుగు నీరు నిల్వలు లేకుండా చూసుకోవాలని పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని తప్పనిసరిగా దోమ కాటు బారిన పడకుండా ఉండాలంటే మందపు దుస్తులు మాత్రమే వాడాలని దీనివల్ల దోమ కాటు బారిన పడకుండా ఉంటామని ఎటువంటి జ్వరాలు వచ్చిన ప్రభుత్వ వైద్యశాలలో సంప్రదించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎదురవైద్యాధికారిని భవ్య శ్రీ, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.

0 Comments