రామగుండానికి మరో 50 కోట్లు మాంజూరు చేయండీ
ఐ.టీ, ఇండస్ట్రియల్ పార్క్ శంకుస్థాపన చేసి, కుర్సి కుమ్మి భూముల పట్టాలు ఇవ్వండి
సానుకులంగా స్పందించిన మంత్రి కేటీఆర్
-రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్
రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆశీర్వాదం తీసుకున్న రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
వాస్తవ తెలంగాణ , సెప్టెంబర్ 24/ రామగుండం ప్రతినిధి: రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ తమ జన్మదినం సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ ఆశీస్సులు తీసుకున్నారు. అదివారం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హైదరాబాదు ప్రగతి భవన్ లో రాష్ట్ర మంత్రి కేటీఆర్ ని కలిసారు. ఈ సందర్భంగా రామగుండం కార్పొరేషన్ కు మరో 50 కోట్ల విడుదల చేయాలని మంత్రిని ఎమ్మెల్యే కోరగా వారు సానుకులంగా స్పందించి సోమవారం జి.ఓ. ఇస్తామని తెలపడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు.
అక్టోబర్ 1 వ తేదిన రామగుండం నియోజకవర్గం కేటీర్ వస్తున్న సందర్భంగా ఐ. టీ, ఇండస్ట్రియల్ పార్క్, కుర్సి కుమ్మి భూముల పట్టాలు పంపిణీ మాంజూరు, కార్పొరేషన్ కు 100 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయాలని కోరడం జరిగిందని కేటిఆర్ సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు.

0 Comments