టేక్మాల్,వాస్తవ తెలంగాణ న్యూస్:
మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బండి సంజయ్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డౌన్ డౌన్ అంటూ స్థానిక పోలీస్ స్టేషన్ లో బిఆర్ఎస్ నాయకులు పిటీషన్ దాఖలు చేశారు అనంతరం ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి సంస్కారహీనుడైన బండి సంజయ్ ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉండడం సిగ్గుచేటు అని, అతని వెంటనే పదవి నుండి తొలగించాలని లేనిచో ఇటు ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని తెలియజేశారు. అతని ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉన్నారని ఇలాంటి సంస్కారహీన మాటలు మాట్లాడడానికి సిగ్గు లేదా అని ప్రశ్నించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు భక్తుల వీరప్ప, జాగృతి అధ్యక్షురాలు పట్లోళ్ళ మల్లికా, ఎంపీపీ చింతా స్వప్న రవి, సర్పంచ్ సుప్రజా భాస్కర్, మాజీ సర్పంచ్ వరలక్ష్మీ, బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు సిద్దయ్య,కల్పణ, మాణిక్యం,సాయి, భాస్కర్, రవి,సుధాకర్, బాలకృష్ణ, అశోక్,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు


0 Comments