అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం
జవహర్ నగర్, ఫిబ్రవరి 6వాస్తవ తెలంగాణ ప్రతినిధి: సీఎం కేసీఆర్ భారత రాజ్యాంగాన్ని అవమానించడం దారుణమని కాంగ్రెస్ పార్టీ జవహర్నగర్ నాయకులు మండిపడ్డారు. టీపీసీసీ పిలుపు మేరకు ఆ పార్టీ జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మహిళా విభాగం అధ్యక్షురాలు అనంతలక్ష్మి ఆధ్వర్యంలో ఆదివారం అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం కాంగ్రెస్ జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్యాదవ్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గోగుల సరితతో కలిసి కేసీఆర్ చిత్రపటానికి మద్యంతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ దమ్మాయిగూడ మున్సిపల్ అధ్యక్షుడు ముప్ప రామారావు, వెంకటేశ్, సీనియర్ నాయకులు బండకింది ప్రసాద్గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కిరణ్, శ్రీనివాస్రెడ్డి, నాయకులు బోయినపల్లి నర్సింహ, రాజుయాదవ్, యాదగిరి, జోగి సునీత, గండి సునీత, చింత విజయ, జయమ్మ, స్వప్న తదితరులు పాల్గొన్నారు.
0 Comments