Wanted Reporters

Wanted Reporters

స్వయం ఉపాధితో దళితులు ఎదగాలి దళిత బంధు రూ.10లక్షలతో మీ కాళ్లపై మీరు నిలబడాలి దళితులు ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం సిద్దిపేట నియోజకవర్గ బంజరుపల్లిలో దళిత బంధు అవగాహన సదస్సులో రాష్ట్ర మంత్రి హరీశ్ రావు

 స్వయం ఉపాధితో దళితులు ఎదగాలి దళిత బంధు రూ.10లక్షలతో మీ కాళ్లపై మీరు నిలబడాలి దళితులు ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం సిద్దిపేట నియోజకవర్గ బంజరుపల్లిలో దళిత బంధు అవగాహన సదస్సులో రాష్ట్ర మంత్రి  హరీశ్ రావు




సిద్దిపేట వాస్తవ తెలంగాణ న్యూస్ :-స్వయం ఉపాధితో దళితులు ఎదగాలి, దళిత బంధుతో మీ కాళ్లపై మీరు నిలబడే విధంగా ప్రభుత్వం 10 లక్షలు అందిస్తున్నది. దేశంలో ఏ ముఖ్యమంత్రి ఈ విధంగా ఆలోచన చేయలేదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేట నియోజకవర్గ నారాయణ రావుపేట మండలం బంజరుపల్లి గ్రామంలో ఆదివారం దళిత బంధు అవగాహన సదస్సుకు హాజరై మాట్లాడారు, దళితులు ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం తీసుకొచ్చారని, అధికారులు గ్రామంలో ఇంటింటికీ వచ్చి సర్వే చేస్తారని, సహకరించాలని గ్రామస్తులకు మంత్రి హరీష్ రావు అవగాహన కల్పించారు,గ్రామంలో 21 మంది దళిత కుటుంబాలకు పథకం వర్తించనున్నదని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోనే తొలి సోలార్ గ్రామమైన బంజరుపల్లి ఐక్యతకు.. ఓకేమాట, ఒకేబాటలో నడిచే గ్రామమని తెలిపారు, మరింత ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని హామీనిచ్చారు. గ్రామాభివృద్ధికై ఉగాది పండుగ తర్వాత ఇంటి అడుగుజాగలో ఇళ్లు కట్టిస్తానని భరోసా ఇచ్చారు. ప్రయివేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్య అందేలా రూ.7300 కోట్ల రూపాయలతో మన ఊరు-మనబడి కార్యక్రమంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్నీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం తరగతులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. 

అలాగే వైద్యంలో ప్రతీ జిల్లాకు ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నట్లు, సిద్దిపేటలో 900 పడకల ఆసుపత్రిగా చేసుకుంటున్నట్లు వివరించారు. సిద్దిపేటలోని ఆసుపత్రిలో పేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. 

దేశంలోని బీజేపీ పాలిత, ఇతర రాష్ట్రాలలో ఎక్కడా లేని విధంగా దళిత కుటుంబ పెళ్లికి తొలుత 50 వేల రూపాయలతో ప్రారంభించిన కల్యాణ లక్ష్మీ ఇవాళ.. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ కింద 10 లక్షల ఆడ బిడ్డల పెళ్లిలకు ఒక్కొక్కరికీ లక్ష 116 చొప్పున అందించినట్లు తెలిపారు. 

ఈ మేరకు గ్రామ బొడ్రాయి, సారుగమ్మ అమ్మవారు విగ్రహా ప్రతిష్ఠ మహోత్సవంలో హాజరై గ్రామ బొడ్రాయి ప్రతిష్ఠ పండుగలో బొడ్రాయిని ఆవిష్కరించారు. ఆ తర్వాత గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, నారాయణరావుపేట ఏంపీపీ బాలమల్లు, జెడ్పీటీసీ కుంబాల లక్ష్మీ, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ ఆనంతరెడ్డి, గ్రామ సర్పంచ్ రోమాల శంకర్, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Ad Code