Wanted Reporters

Wanted Reporters

💥కాల్పుల కేసు చేధించిన సిద్దిపేట పోలీస్ కమిషనర్💥

 * కాల్పుల కేసు చేధించిన సిద్దిపేట పోలీస్ కమిషనర్ *



సిద్దిపేట, వాస్తవ తెలంగాణ న్యూస్:


సిద్దిపేట వాస్తవ తెలంగాణ:- సిద్దిపేట సబ్ రిజిస్టర్ కార్యాలయం సమీపంలో వకుళాభరణం నరసయ్య తన ఇనోవా కారులో పెట్టిన డబ్బులను కారు డ్రైవర్ పర్షరాములు ను గుర్తుతెలియని దుండగులు బెదిరించి, తుపాకితో కాల్చి  డబ్బులు  దోచుకునిపోయినా దోపిడి మరియు హత్యప్రయత్నం కేసులో నేరస్థులను అరెస్ట్ చేసి వారివద్ద నుండి నగదుడబ్బులు, మరియు నేరం చేయడంలో ఉపయోగించిన వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది.సిద్దిపేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వకుళాభరణం నరసయ్య తనకు హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్న 176 గజాల ఫ్లాట్ ను  సిద్దిపేటకు చెందిన శ్రీధర్ రెడ్డి,  అమ్మడానికి ధర నిర్ణయించుకుని 31-01-2022 నాడు రిజిస్ట్రేషన్ ఉన్నందున రిజిస్ట్రేషన్ ఆఫీస్ వద్ద శ్రీధర్ రెడ్డి 43 లక్షల 50 వేల రూపాయలు ఇవ్వగా నర్సయ్య అట్టి నగదును ఒక రెడ్ కలర్ బ్యాగ్లో పెట్టుకొని తన పరశురాములు కు ఇచ్చి రిజిస్ట్రేషన్ నిమిత్తం ఆఫీసులోనికి వెళ్ళగా,  డ్రైవర్ క్యాష్ బ్యాగును ఇన్నోవా కార్లో పెట్టుకొని తన యజమానికొరకు వేచి చూస్తూ ఉండగా ఇద్దరు గుర్తు తెలియని దుండగులు వచ్చి ఇన్నోవా లో కూర్చుని ఉన్న డ్రైవర్ ను డబ్బులు ఇవ్వమని బెదిరించి, తుపాకీతో డ్రైవర్ పర్ష రాములు పై కాల్చి డబ్బులు దొంగలించు కొనిపోయినారని దరఖాస్తు మేరకు సిద్దిపేట ఒకటవ టౌన్ లో కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించడం జరిగింది. ఇట్టి కేసుకు సంబందించి 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అన్నీ కొణాలలో పరిశోధన ప్రారంబించి అన్ని ఆధారాలను సేకరించి  సాంకేతిక పరిజ్ఞానం తో  మరియు పాత నేరస్తులను కూడా విచారించి, ఈ క్రమంలో నమ్మదగిన సమాచారం మేరకు నిన్న ఉదయం ఎడమ సాయి కుమార్ అను వ్యక్తిని  అదుపులోకి తీసుకొని అన్నీ ఆధారాలతో విచారించగా తనకు తానుగా నేరాన్ని ఒప్పుకుని నేరానికి సంబందించిన పూర్తి వివరాలు వెల్లడించాడు. ఈ క్రమంలో ఈ నేర పాల్గొన్న ఇతర నేరస్తులైన గజ్జె రాజు,బలింపురం కరుణాకర్,  బిగుళ్ల వంశీకృష్ణ  లను కూడా అదుపులోకి తీసుకుని విచారించి వారి వద్ద నుండి చోరీ సొత్తును మరియు నేరం చేయడానికి ఉపయోగించిన వాహనాలను నేరస్తులనుండి స్వాధీన పరుచుకుని నేరస్తులకు ఈరోజు కోర్టులో హాజరుపరచడం జరిగింది.ఇట్టి కేసులో ప్రధాన ముద్దాయి గజ్జె రాజు, తండ్రి యాదయ్య, వయస్సు 26 సంవత్సరాలు, కులం ఎస్సీ మాదిగ, గ్రామం మంగోల్, మండలం కొండపాక, జిల్లా సిద్దిపేట. ఇతడు తన సమీప బందువు లు అయిన ఎడమ సాయి కుమార్ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని ఆశ్రయం కల్పించాలని అడగగా రాజు తను ఉంటున్న ఇంటిలో ఆశ్రయం కల్పించాడు. అమ్మాయి విషయంలో సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో వీరిపై పోక్సో కేసు నమోదైంది సిద్దిపేట వన్టౌన్ పోలీసులు వీరిని  అరెస్ట్ చేసి జైలుకు పంపినారు. 2021 సెప్టెంబర్ నెలలో బెయిలుపై బయటకు వచ్చినారు. ఇట్టి  పోక్సో కేసులో అరెస్టయి ఈ సందర్భంలో అయిన ఖర్చులు మరియు వారికి గల చెడు అలవాట్లు వల్ల అయిన అప్పులు ఏదైనా నేరం చేసి వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు.  ఈ క్రమంలో రిజిస్ట్రేషన్ ఆఫీసుల వద్ద డబ్బులు ఈజీ గా చేతులు మారుతాయని తెలుసుకుని గతంలో తాను చూసిన సిద్దిపేట రిజిస్ట్రేషన్ ఆఫీసు వద్ద తేదీ: 31-01-2022 రోజున పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ జరిగే అవకాశం ఉందని తెలుసుకుని రాజు మరియు సాయి ముందుగా వేసుకున్న పథకం ప్రకారం రాజు సాయి ని కుకునూరుపల్లి కి పిలిపించుకొని తాము అంతకుముందు సిరిసనగండ్ల లో  దొంగలించిన పల్సర్ మోటార్ సైకిల్ పై  ఇద్దరు కలిసి సిద్దిపేట రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు వచ్చి రిజిస్ట్రేషన్ ఆఫీస్ పక్కన గల్లీలో మోటార్ సైకిల్ పార్క్ చేసి  రిజిస్ట్రేషన్ ఆఫీస్ పక్క గల్లీలో ఇద్దరు కలిసి  నడుచుకుంటూ వెళ్లి ఆఫీస్ చుట్టుపక్కల ఉన్న డాక్యుమెంట్ లు రాసే ఆఫీసులను గమనిస్తూ, ఆ సమయంలో ఒక్క ఆఫీసులో  లో డబ్బులు లెక్కపెడుతున్న శబ్దం వినబడగానే రాజు అట్టి ఆఫీసు ముందు బండి పై కూర్చొని షాప్ లో వారిని గమనిస్తూ ఆ తర్వాత కొద్ది సేపటికి ఒక వ్యక్తి కౌంటింగ్ మిషిన్ ఇన్నోవా కార్ లో పెట్టి షాప్ లోకి వెళ్లి కొద్దిసేపటి తర్వాత రెడ్ కలర్ బ్యాగును పట్టుకొని నలుగురు వ్యక్తులు బయటకు వచ్చి ఒక వ్యక్తి రెడ్ కలర్ బ్యాగును డ్రైవర్ కు ఇచ్చి జాగ్రత్తగా పెట్టుకో చెప్పి అతడితో పాటు మరికొందరు రిజిస్ట్రేషన్ చేయడానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్ లోకి వెళ్ళగానే డ్రైవర్ కారును మెల్లగా నడుపుకుంటూ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు కొద్ది దూరంలో పెట్టుకొని ఉండగా, డ్రైవర్ డోరు అద్దాన్ని కొద్దిగా దించుకుని ఫోన్లో మాట్లాడుతున్నది గమనించి రాజు మరియు సాయి లు పల్సర్ మోటార్ సైకిల్ తీసుకొనివచ్చి కారు వెనక పెట్టి,   రాజు డ్రైవర్ దగ్గరికి వెళ్లి కారు అద్దం దించమని  తుపాకి చూపిస్తూ కార్ డోర్ తీస్తావా లేదంటే చంపేస్తానని బెదిరించినాడు.  డ్రైవర్ డోర్ తీయకుండా కారు ను స్టార్ట్ చేసి ముందుకు తీసుకెలే ప్రయత్నం చేయగా, ఎట్టి పరిస్తితుల్లో డ్రైవరును చంపి ఐనా దోపిడి చేసి డబ్బులు దొంగిలించానే ఉద్దేశంతో తన వద్ద ఉన్న తుపాకి తో డ్రైవర్ను కాల్చి, కారు అద్దాన్ని పగలగొట్టి కారు యొక్క డోర్లు తెరవగా సాయి ఎడమవైపు డోరునుండి నగదు గల బ్యాగు ను తీసుకొన్న తరువాత ఇద్దరు కలిసి పల్సర్ బైక్ పై నగదు గా బ్యాగు తో పారిపోయినారు. ఇట్టి నేరస్తులను నిన్న అనగా డి.06-02-2022 నాడు అరెస్టు చేసి చోరీ సోత్హును స్వాధీన పరచుకుని నేరస్తులని ఈ రోజు కోర్టులో హాజరు పరచడం జరిగింది.


ఈ కేసులో ఇంకా తుపాకుల కోణంలో లోతుగా పరిశోధన జరుగుతున్నది. పరిశోధన కొనసాగుతున్నందున తుపాకులకు సంబందించిన పూర్తి వివరాలు పరిశోధన పూర్తి అయిన తరువాత తెలియజేయడం జరుగుతుంది,గజ్జె రాజు, తండ్రి యాదయ్య, వయస్సు 26 సంవత్సరాలు, నివాసం బండ్లగూడ కీసర, యాదాద్రి భువనగిరి జిల్లా ఎడమ సాయి కుమార్, తండ్రి మల్లేష్, వయస్సు 22 సంవత్సరాలు, నివాసం బండ్లగూడ కీసర, యాదాద్రి భువనగిరి జిల్లా బలింపురం కరుణాకర్, తండ్రి బాల్ నర్సయ్య, వయసు 28 సంవత్సరాలు, నివాసం బండ్లగూడ కీసర, యాదాద్రి భువనగిరి జిల్లా బిగుళ్ల వంశీకృష్ణ, తండ్రి దుర్గేష్, వయసు 20 సంవత్సరాలు, కులం ఎస్సీ మాదిగ, వృత్తి కూలి పని, చాచా నెహ్రూ నగర్ బన్సీలాల్ పేట,సికింద్రాబాద్ ,జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ కేసును ఛేదించడంలో సిద్దిపేట పోలీస్ టీమ్,  అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ప్రత్యేక ప్రతిభ కనబర్చారు అందుకు ఈ 15 ప్రత్యేక బృందాలలో ఉన్నా ప్రతి ఒక్క అధికారి పేరుపేరునా అభినందిస్తున్నాను. ప్రత్యేకించి ఇన్వెస్టిగేషన్ అధికారి అయినా బిక్షపతి వన్టౌన్ ఇన్స్పెక్టర్కు కేసును ఛేదించడం లో సపోర్టుగా గైడెన్స్ ఇచ్చినా సిద్దిపేట, గజ్వేల్ ఎసిపిలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అంతేకాక సిద్దిపేట ఐటీ సెల్ లో ఉన్న ప్రతి ఒక్క ఆఫీసర్ తమ సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించి కేసు ఛేదనలో ముఖ్యపాత్ర వహించినందుకు వారిని అభినందిస్తున్నాను కమిషనర్ శ్వేత తెలిపారు.

Post a Comment

0 Comments

Ad Code