Wanted Reporters

Wanted Reporters

కిష్టయ్య పల్లి, అలీ నగర్ లో కోటి ముప్పై నాలుగు లక్షల రూపాయల అభివృద్ధి పనుల ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

 పల్లె ప్రగతి తో గ్రామాలకు మహర్దశ 

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

కిష్టయ్య పల్లి, అలీ నగర్ లో కోటి  ముప్పై నాలుగు లక్షల రూపాయల అభివృద్ధి పనుల ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్


జిన్నారం/గుమ్మడిదల, తెలంగాణ సాక్షి న్యూస్:-

కిష్టయ్య పల్లి, అలీ నగర్ లో








దేశంలో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ప్రారంభించిన పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామాలకు మహర్దశ తీసుకొని వస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం జిన్నారం మండల పరిధిలోని కిష్టయ్య పల్లి గ్రామంలో 82 లక్షల రూపాయలతో నిర్మించిన పాఠశాల భవనం, అంబేద్కర్ భవన్, కమ్యూనిటీ హాల్, చెరువు కట్ట పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం అల్లి నగర్ గ్రామంలో 48 లక్షల రూపాయలతో నిర్మించిన స్వాగత తోరణం, మినీ చిల్డ్రన్స్ పార్క్, మినీ బతుకమ్మ ఘాట్, మినీ భోజనశాల, అంగన్వాడి భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత పాలకుల హయాంలో లక్ష రూపాయల నిధులు తీసుకొని రావాలంటే సంవత్సరాల తరబడి వేచి చూడాల్సి వచ్చేదని, నేడు ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో కోట్ల రూపాయలతో గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళుతున్నట్లు తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వ పథకాలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. దళితుల సంక్షేమం కోసం త్వరలో ప్రారంభం కానున్న దళిత బంధు పథకం విప్లవాత్మక  మార్పులకు శ్రీకారం చుట్టబోతుందన్నారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీ రవీందర్ గౌడ్, స్థానిక సర్పంచ్ ప్రకాష్ చారి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


దోమడుగు లో..





గుమ్మడిదల మండలం పరిధిలోని దోమడుగు గ్రామంలో 25 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించతలపెట్టిన సిసి రోడ్డు పనులకు సోమవారం స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్  రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజశేఖర్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీ  ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, జెడ్ పి టి సి కుమార్ గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Ad Code