*ఆర్థిక సాయం అందజేత*
గుమ్మడిదల, తెలంగాణ సాక్షి న్యూస్:-
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం వీర రెడ్డి పల్లి మధిర గ్రామమైన మొల్లగూడకు చెందిన నర్సింలు అనే వ్యక్తి పాము కాటుకు గురై మృతి చెందాడు. చేతికి అందిన కొడుకు మృత్యువాత పడడంతో ఆ కుటుంబం బోరున నిరోధిస్తుంది. విషయం తెలుసుకున్న ఎన్ ఎం ఎం యువసేన మండల నాయకులు చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ సహకారంతో కుటుంబానికి అండగా నిలిచారు. కుటుంబానికి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు గ్యారాల మల్లేష్, మాజీ ఉప సర్పంచ్ గోపాల్, వార్డు సభ్యుడు వెంకటేష్, నాయకులు వెంకటేష్, యాదగిరి వీరేశ్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

0 Comments