Wanted Reporters

Wanted Reporters

సమిష్టి సహకారంతో అభివృద్ధి రహదారి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

 సమిష్టి సహకారంతో అభివృద్ధి 

రహదారి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్



అమీన్పూర్ తెలంగాణ సాక్షి న్యూస్:-


సమిష్టి సహకారంతో గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని  వెళ్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం అమీన్పూర్ మండలం పటేల్ గూడ  గ్రామ పరిధిలో గల యాక్సిస్ హోమ్స్ నుండి సూర్యోదయ కాలనీ వరకు చేపడుతున్న బిటి రోడ్డు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ రోడ్డు నిర్మాణం పూర్తయితే  సుమారు 10 కాలనీల ప్రజలకు మెరుగైన రహదారి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అమీన్పూర్ మండల పరిధిలో వెలుస్తున్న నూతన కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికబద్ధంగా నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

Post a Comment

0 Comments

Ad Code