Wanted Reporters

Wanted Reporters

కోవిడ్ కేంద్రాన్ని పరిశీలించిన అడిషనల్ కలెక్టర్

 కోవిడ్ కేంద్రాన్ని పరిశీలించిన అడిషనల్ కలెక్టర్




గుమ్మడిదల తెలంగాణ సాక్షి న్యూస్:-

 

గుమ్మడిదల మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన కొవిడ్ కేంద్రాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు. స్థానిక  ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన కొవిడ్ కేంద్రంలో అధికారులు వసతులను నిశితంగా పరిశీలించారు. పరీక్షల కోసం వచ్చే రోగులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలన్నారు. వైద్య సేవలను అందుబాటులో ఉంచేందుకే సెంటర్లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. సెంటర్లో పెద్దమొత్తంలో కరోనా టెస్టులు జరిగేలా చూడాలన్నారు.కరోనా కట్టడి చర్యలకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. పరీక్షల కోసం తరలి వచ్చే రోగులు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి సద్ది ప్రవీణ విజయ భాస్కర్ రెడ్డి, జెడ్పిటిసి కుమార్ గౌడ్, స్థానిక సర్పంచ్ నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ మొగులయ్య, ఎంపీటీసీలు, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, అధికారులు ఎంపీడీవో చంద్రశేఖర్, ఆరోగ్య కేంద్రం డాక్టర్ శ్రీధర్, నాయకులు, హాస్పిటల్ సిబ్బంది,స్థానికులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Ad Code